యుఎస్.. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ హెడ్ గా మహిళను ఎంపిక చేసిన నాసా

చంద్ర మండలానికి తాము పంపే మానవ సహిత అంతరిక్ష  వ్యోమయాన కార్యక్రమానికి హెడ్ గా ఓ మహిళను   నాసా ఎంపిక చేసింది. అంతటి విశిష్ట హోదాను కేథీ ల్యుడర్స్ అనే ఈ మహిళ పొందగలిగింది. 2024 లో చంద్రునిపైకి..

  • Umakanth Rao
  • Publish Date - 10:54 am, Sat, 13 June 20
యుఎస్.. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ హెడ్ గా మహిళను ఎంపిక చేసిన నాసా

చంద్ర మండలానికి తాము పంపే మానవ సహిత అంతరిక్ష  వ్యోమయాన కార్యక్రమానికి హెడ్ గా ఓ మహిళను   నాసా ఎంపిక చేసింది. అంతటి విశిష్ట హోదాను కేథీ ల్యుడర్స్ అనే ఈ మహిళ పొందగలిగింది. 2024 లో చంద్రునిపైకి మానవ సహిత లాంచ్  ప్రయోగాలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్న నాసా.. ఈమె లోని ప్రతిభను గుర్తించి ఈ హోదాను కల్పించిందని ఈ సంస్థ హెడ్… జిమ్ బ్రైడెన్ స్టెయిన్ ప్రకటించారు. కమర్షియల్ క్రూ, కమర్షియల్ కార్గో కార్యక్రమాలను ఈమె విజయవంతంగా చేపట్టగలిగిందని, మరో నాలుగేళ్లలో తాము చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించిన పనులను కూడా సమర్థంగా నిర్వహించగలదని భావిస్తున్నామని ఆయన ట్వీట్  చేశారు. 1992 లో నాసా లో చేరిన కేథీ ల్యుడర్స్.. గత మే 30 న స్పేస్ రాకెట్ లో ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన మిషన్ ను పర్యవేక్షించింది. నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఆ మిషన్ ని చేపట్టాయి. ఒక మహిళను, మరో వ్యోమగామిని 2024 లో చంద్ర మండలంపైకి పంపాలని అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.