ముంబైకి ముంచుకొస్తున్న ముప్పు
ముంబై మహానగరానికి మహా ముప్పు ముంచుకొస్తోందా? రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, ఆధారంగా వెలుగులోకి వస్తున్న పలు అధ్యయన సంస్థల నివేదికలు పరిశీలిస్తే దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరానికి పెను ముప్పు పొంచి ఉందన్న వాదనకు బలం చేకూరుతుంది.

ఏప్రిల్ 25 శనివారం సాయంత్రం వరకు ముంబైలో విజృంభిస్తున్న కరోనా వైరస్ తాకిడికి 4870 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ముంబైలో 281 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క రోజే 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ 12 మంది మృతుల తో కలిపి ముంబై నగరంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి సంభవించిన మరణాల సంఖ్య 191 చేరింది. ఇప్పటివరకు 762 మంది అరుణ వైరస్ బారినపడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
గత వారం రోజులుగా ముంబై మహానగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది వేగం కొనసాగితే మే నెలాఖరుకు ఒక్క ముంబై మహానగరంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలు దాటవచ్చని ఇటీవల ఓ అధ్యయనం నివేదిక వివరించింది. దానికి తోడు ముంబై మహానగరంలో జనసాంద్రత చాలా ఎక్కువ. అందువల్లే ధారవి లాంటి మురికివాడల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ముంబై మహానగరం కరోనా వైరస్ తాకిడికి అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.