హీరోలంటే ఇష్టం ఉంటుంది. అది కామన్. కానీ, అది పరిధిలో ఉండాలి. అభిమానం పేరుతో ప్రాణాలు పణంగా పెట్టడం..ఎదుటివారి ప్రాణాలు తియ్యడం వంటివి చెయ్యకూడదు. అలాంటి వాటిని సదరు హీరోలు కూడా ఒప్పుకోరు. ఎన్నిసార్లు తాము కలిసే ఉంటామని చెప్తున్నా..వారి ఫ్యాన్స్ మాత్రం చెవికెక్కడం లేదు. తాజాగా తమిళనాడులో ఫ్యాన్ వార్ ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువరాజ్ హీరో విజయ్‌కి వీరాభిమాని. అదే వీధిలో ఉండే దినేశ్‌బాబు రజనీకాంత్ కోసం ప్రాణం ఇస్తాడు. దినేశ్‌బాబు, యువరాజ్లు ఇద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ గురువారం సాయంత్రం రోజూలాగే సరాదాగా ఓ చోట కూర్చోని కబుర్లు చెప్పుకుంటున్నాడు. మాటల మధ్యలో హీరోల ప్రస్తావన వచ్చి..గొడవకు దారి తీసింది. కరోనా బాధితుల సహాయ నిధికి మా హీరోనే ఎక్కువ విరాళమిచ్చారంటే.. మా హీరో ఇచ్చారంటూ ఇద్దరూ గొడవకు దిగారు. కాసేపటికి.. వాదన కాస్తా పోట్లాటకు దారితీసింది. ఆవేశంలో దినేశ్… యువరాజ్‌ను నెట్టడంతో అతడు పక్కనే ఉన్నరాయిపై పడి.. గాయం కావడం వల్ల స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు. యువరాజ్ మృతదేహాన్ని.. పుదుచ్చేరి కళాపేట్లోని ఆసుపత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. మరకనమ్ పోలీసులు దినేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.