AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌త్‌కు పొంచివున్న మ‌రో ముప్పు..బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తోంది

భార‌త్‌కు మ‌రోముప్పు పొంచిఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అది బంగాళాఖాతం మీదుగా భార‌త్‌లోని కోస్తా తీరాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

భార‌త్‌కు పొంచివున్న మ‌రో ముప్పు..బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తోంది
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2020 | 10:16 AM

Share

భార‌త్‌కు మ‌రోముప్పు పొంచిఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అది బంగాళాఖాతం మీదుగా భార‌త్‌లోని కోస్తా తీరాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. తీవ్ర తుఫాను దేశం మీద‌కు దూసుకొస్తోంద‌ని చెప్పారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 27న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని తెలిపారు. దీని ప్రభావంతో దేశంలోని తీర ప్రాంతమంతా అల్లకల్లోలం కానుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

అండమాన్ నికోబర్ దీవుల్లో ఏర్పడే ఈ తుపాను నెమ్మదిగా పెరిగి కోస్తా ప్రాంతాలను అతలాకుతలం చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తుపాను ప్రభావం అనంత‌రం మరో తుపాను మే 1న ఉత్తర అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో తీర ప్రాంతాల‌ను వాన‌లు, వ‌డ‌గాలులు వ‌ణికిస్తాయ‌ని పేర్కొన్నారు. తుపాను ప్రభావాన్ని తట్టుకొనేందుకు అప్రమత్తం కావాలని అధికారుల్ని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇక‌, ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణంలో మార్పులు క‌నిపిస్తున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల వరకూ పెరిగి 40 డిగ్రీలను దాటింది. శనివారం నాడు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా