ఆ సూత్రధారి ఆచూకీ తెలిసింది.. విచారణకు సహకరిస్తాడట !

ఆ సూత్రధారి ఆచూకీ తెలిసింది.. విచారణకు సహకరిస్తాడట !

తబ్లీఘీ జమాత్ నేత మౌలానా సాద్ కందాల్వీ ఆచూకీని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఈ మౌలానా గత నెలలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడు.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Apr 09, 2020 | 2:20 PM

తబ్లీఘీ జమాత్ నేత మౌలానా సాద్ కందాల్వీ ఆచూకీని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఈ మౌలానా గత నెలలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇతనిపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇతగాడు ఢిల్లీలోని జకీర్ నగర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మా క్లయింట్ క్వారంటైన్ లో ఉన్నాడు.. ఆ కాలం ముగిసిన అనంతరం పోలీసుల విచారణకు సహకరిస్తాడు అని ఆయన తరఫు లాయర్ తౌసీఫ్ ఖాన్ తెలిపారు.ఈ మౌలానాతో బాటు మరో ఏడుగురిపైనా ఖాకీలు కేసు నమోదు చేశారు. తన క్లయింట్ క్వారంటైన్ కాలం వచ్ఛే వారం ముగియనుందని తౌసీఫ్ ఖాన్ చెప్పారు. సాద్ చేసినట్టుగా చెబుతున్న ఓ ఆడియో రికార్డింగ్ గత మార్చి 21 న వాట్సాప్ లో సర్క్యులేట్ చేసింది. అందులో.. ఈయన లాక్ డౌన్ రూల్స్ పట్టించుకొవద్దని, సోషల్ డిస్టెన్స్ ని ఉల్లంఘించాలని తన సహచరులకు ‘ప్రబోధించాడు’. పోలీసులు జారీ చేసిన రెండో నోటీసుకు తాము త్వరలో సమాధానమిస్తామని తౌసీఫ్ ఖాన్ తెలిపారు. తబ్లీఘీ జమాత్ మత పర కార్యక్రమానికి హాజరైనవారికి.. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మధ్య లింక్ ఉందని వార్తలు వస్తున్న వేళ ఈ మౌలానా ఆచూకీని పోలీసులు కనుగొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్చి 24 న జరిగిన ఈ కార్యక్రమానికి మౌలానాతో బాటు మహమ్మద్ అష్రఫ్, మహ్మద్ సల్మాన్, యూనస్, ముర్సలీన్ సైఫి, జిషాన్, ముఫ్తీ షెహజాద్ అనే మత గురువులు కూడా హాజరయ్యారట. లాక్ డౌన్ ఉత్తర్వుల గురించి తెలిసినప్పటికీ వాటిని వీరు పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ఈ మౌలానాను లోగడ కలిసినట్టు మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు ఎవరూ ఇప్పటివరకు నోరెత్తకపోవడం గమనార్హం. అతి సున్నితమైన, సంచలనాత్మక మైన ఈ వ్యాఖ్యలపై వీరు గుట్టు చప్పుడు చేయకపోవడం ఆశ్ఛర్యకరం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu