దేశంలో లక్షన్నర కరోనా కేసులు.. తప్పదంటున్న అధ్యయనం

కరోనా కట్టడిలో విజయవంతంగా ముందుకు వెళుతోంది మన దేశం, ప్రపంచంలోని సుమారు 30 దేశాలకు కూడా మన దేశం సాయం చేస్తోంది అని సంతోషిస్తున్న వారికిది షాకింగ్ న్యూస్. మనదేశంలో మరో మూడు వారాల్లో లక్షన్నర కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంఛనా వేస్తోంది.

దేశంలో లక్షన్నర కరోనా కేసులు.. తప్పదంటున్న అధ్యయనం
Follow us

|

Updated on: Apr 09, 2020 | 3:23 PM

IIM-Rohtak team predicting 1.5 Lac corona cases in India: కరోనా కట్టడిలో విజయవంతంగా ముందుకు వెళుతోంది మన దేశం, ప్రపంచంలోని సుమారు 30 దేశాలకు కూడా మన దేశం సాయం చేస్తోంది అని సంతోషిస్తున్న వారికిది షాకింగ్ న్యూస్. కరోనా వైరస్ నియంత్రణలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవంటున్న ఓ అధ్యయన బృందం మనదేశంలో మరో మూడు వారాల్లో లక్షన్నర కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంఛనా వేస్తోంది. ఈ అంఛనా నిజమే అయితే.. మన దేశం ప్రమాదపుటంచు నుంచి ఇంకా బయటపడలేదన్నమాట.

రోహ్‌తక్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బృందం ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, వాటి ట్రెండ్‌ను అధ్యయనం చేసింది. మేథమేటికల్ మోడల్‌లో వీరి అధ్యయనం కొనసాగింది. మార్చి రెండో వారంలో మొదలైన కరోనా ప్రభావం గత మూడు వారాల్లో అయిదువేల సంఖ్యను దాటింది. మృతుల సంఖ్యను కట్టడి చేయగలుగుతున్నా.. పాజటివ్ కేసుల నమోదు వేగం మాత్రం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.

మొదటి రెండు వారాల తర్వాత కరోనా కంట్రోల్ అవుతుందన్న సంకేతాలు కనిపించాయి. అయితే, సడన్‌గా తెరమీదికి వచ్చిన తబ్లిఘీ జమాత్ వ్యవహారంతో దేశం యావత్తు ఉలిక్కి పడింది. ముస్లిం సదస్సుకు హాజరైన వారు దేశంలోని నలుమూలలకు వెళ్ళి సామాన్య జనజీవనంతో మమేకమయిపోయిన తర్వాత తబ్లిఘీ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత దేశంలో నలు మూలలా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం మొదలైంది.

తబ్లీఘీ కార్యకర్తల సంచారం దేశాన్ని కరోనా బారిన పడేసిందనడంలో సందేహం లేదు. ఈ క్రమరంలో ఐఐఎం రోహ్‌తక్ బృందం దేశంలో ఏప్రిల్ 15వ తేదీ నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13వేలు దాటుతుందని, అదే వేగంతో మార్చి మొదటి వారం కల్లా దేశంలో లక్షన్నర కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంఛనా వేసింది. తబ్లిఘీ కార్యకర్తలను ట్రేస్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న అలసత్వం దేశాన్ని కరోనా ముప్పు ముంగిట్లోకి నెడుతోందని ఐఐఎం రోహ్‌తక్ అధ్యయన బృందం అంఛనా వేస్తోంది.

తబ్లిఘీ సదస్సుకు హాజరైన వారు దేశం నలుమూలల ప్రయాణం చేశారని, వారు రైళ్ళు, బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులను ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన వుండవచ్చని ఐఐఎం రోహ్‌తక్‌కు చెందిన ప్రొఫెసర్ ధీరజ్ శర్మ, డాక్టర్ అమోల్ సింగ్, డాక్టర్ అభయ్ పంత్ అభిప్రాయపడుతున్నారు. తాము మరికొందరు స్కాలర్స్‌తో కలిసి జరిపిన అధ్యయనంలో ఇదే తేలిందంటున్నారు.

తబ్లిఘీ సంస్థ వ్యవహారం వెలుగు చూడక ముందు దేశంలో కరోనా కేసుల నమోదు, ఆ తర్వాత కేసుల నమోదు తీరుతెన్నులను ఐఐఎం అధ్యయన బృందం స్టడీ చేసింది. తమ మేథమేటికల్ మెథడాలజీని ఉపయోగించి దేశంలో కరోనా ప్రభావాన్ని అంఛనా వేశారు. తమ అంఛనా 93 శాతం పాజిబిలిటీతో కూడుకున్నదని ఈ బృందం చెబుతోంది. ఈ లెక్కన దేశంలో లాక్ డౌన్ పీరియడ్ మరి కొన్నాళ్ళు పొడిగించడమే బెటర్ అన్న వారి వాదనే సమంజసం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.