అరసవల్లి సూర్య ఆలయ౦ విశేషాలు..

TV9 Telugu

03 May 2024

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది.

ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది.  ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇక్కడ ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలో మూలవిరాట్ ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణశైలి గొప్పతన౦.

శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో  ఈ ఆలయన్ని నిర్మించారు.  మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.

పద్మపురాణ౦ ప్రకార౦ ఇక్కడి మూలవిరాట్ ను సూర్య స్వగోత్రికుడు అయిన కశ్యప మహాముని  ప్రతిష్టించారని చెప్పబడి౦ది.

17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలనలో ఈ ప్రాంత సుబేదారు షేర్ మహమ్మద్ ఖాన్ ఈ సూర్య దేవాలయాన్నీ ధ్వంసం చేశాడు.

దేవాలయంపై జరగనున్న దాడిని ముందే తెలుసుకున్న పండితుడు సీతారామ శాస్త్రి  స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.

157 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించి ఇప్పుడున్న రీతిలో  దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.