సూపర్ స్టార్ రజినీకాంత్.. స్టైల్‌కే కేరాఫ్ అడ్రస్. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగిన తలైవా యంగ్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కండక్టర్‌గా సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం.
అటు రీల్ లైఫ్.. రియల్ లైఫ్‌లోనూ ఆయన జీవితం చాలా మందికి స్పూర్తి. ఇప్పుడు ఆయన జీవితాన్ని వెండితెరపైకి సినిమాగా తీసుకువస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా రజినీ బయోపిక్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
2025లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని.. ఇందులో రజినీకాంత్ పాత్రలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశాలు ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది.
ఇటీవల సాజిద్ పెట్టి పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. రజినీతో దిగిన ఫోటో షేర్ చేస్తూ లెజండరీ సినిమా కోసం పనిచేయడం గర్వంగా ఉందన్నారు.
జీవితంలో మర్చిపోలేని ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నామని.. వేచి ఉండడండి అంటూ రాసుకొచ్చారు సాజిద్. దీంతో రజినీ బయోపిక్ అని తెలుస్తోంది.
ఈ సినిమాలో రజినీకాంత్ వ్యక్తిగత జీవితంలోని విషయాలతోపాటు బస్ కండక్టర్ నుంచి హీరోగా సినీ ప్రయాణం, కెరీర్‌లోని ముఖ్య సంఘటనలు చూపించనున్నారు.
ఈ సినిమాలో రజినీకాంత్ వ్యక్తిగత జీవితంలోని విషయాలతోపాటు బస్ కండక్టర్ నుంచి హీరోగా సినీ ప్రయాణం, కెరీర్‌లోని ముఖ్య సంఘటనలు చూపించనున్నారు.