AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య ప్రకటన వెనుక అద్భుతమైన యాక్షన్ ప్లాన్

అయోధ్య వివాదంపై తీర్పు వచ్చిన మూడు నెలలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ విస్పష్ట ప్రకటనతో పార్లమెంటు ముందుకు వచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ఛైర్మెన్‌గా న్యాయకోవిదుడు పరాశరన్ వ్యవహరస్తారని కూడా ప్రకటించారు. ఇదంతా నార్మల్‌గా కనిపిస్తున్నా… ఈ ప్రకటన వెనుక మోదీ అద్బుతమైన వ్యూహం కనిపిస్తుందంటున్నారు రాజకీయ పండితులు. ఇంతకీ ఆ వ్యూహమేంటి? నవంబర్ 11న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం […]

అయోధ్య ప్రకటన వెనుక అద్భుతమైన యాక్షన్ ప్లాన్
Rajesh Sharma
|

Updated on: Feb 06, 2020 | 4:42 PM

Share

అయోధ్య వివాదంపై తీర్పు వచ్చిన మూడు నెలలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ విస్పష్ట ప్రకటనతో పార్లమెంటు ముందుకు వచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ఛైర్మెన్‌గా న్యాయకోవిదుడు పరాశరన్ వ్యవహరస్తారని కూడా ప్రకటించారు. ఇదంతా నార్మల్‌గా కనిపిస్తున్నా… ఈ ప్రకటన వెనుక మోదీ అద్బుతమైన వ్యూహం కనిపిస్తుందంటున్నారు రాజకీయ పండితులు. ఇంతకీ ఆ వ్యూహమేంటి?

నవంబర్ 11న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని 2.77 ఎకరారల వివాదాస్పద స్థలంపై సర్వహక్కులు హిందువులవేనని సుప్రీం ధర్మాసనం విస్పష్టంగా తీర్పు వెలువరించింది. ముస్లింలు తమ మసీదును నిర్మించుకునేందుకు అయిదు ఎకరాల స్థలం అయోధ్యలోనే ఇవ్వాలని సుప్రీం బెంచ్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. దానికి రామమందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

ఆ తర్వాత బాధ్యతలను ఇక కేంద్రం చూసుకుంటుందని, రామ మందిర నిర్మాణానికి శరవేగంగా చర్యలు తీసుకుంటారన్న వార్తలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. మార్చి చివరి వారం-ఏప్రిల్ మొదటి వారం మధ్యలో మందిర నిర్మాణానికి ముహూర్తం కూడా ఖరారైందన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే, అనుకున్నంత వేగంగా చర్యలకు కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఉపక్రమించలేదు. దానికి కారణం ఈమధ్యలో ఉత్పన్నమైన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వంటి అంశాలు కారణం కావచ్చని పలువురు భావించారు. అయితే, బుధవారం సడన్‌గా ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో అయోధ్య అంశంపై మాట్లాడారు.

ట్రస్టు ఏర్పాటును ప్రకటించారు. దాని పూర్వాపరాలు కూడా వెల్లడించారు. అదే సమయంలో రామ మందిర నిర్మాణం కోసం నిధులను సేకరించే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదంతా నాణేనికి ఒకవైపున కనిపించే కథనం. మరి ఈ ప్రకటన వెనుక ప్రధాని వ్యూహం ఏంటన్నది ఇపుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. దీనికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

ముందుగా కనిపించేవి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటి వరకు వచ్చిన ప్రీపోల్ ఒపీనియన్ పోల్స్ అన్నీ ఢిల్లీలో కేజ్రీవాల్ మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సర్వేలలో ఏఏపీకి భారీ సంఖ్యలో మెజారిటీ కనిపిస్తున్నా… ఓట్ల పర్సెంటేజీలో అంతరం పెద్దగా లేదు. అయోధ్య అంశం గనక ఢిల్లీ ఓటర్లను రీచ్ కాగలిగితే.. 4 నుంచి 5 శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందని, అది బీజేపీకి లాభిస్తుందని మోదీ అంఛనా వేయడమే అయోధ్య అంశాన్ని ప్రస్తావించడానికి ప్రధాన కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఢిల్లీ ఎన్నికలతోపాటు.. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి లభిస్తున్న మద్దతులో కోత పెట్టడానికి కూడా మోదీ అయోధ్య అంశాన్ని లేవనెత్తి వుంటారని మరికొందరు అంఛనా వేస్తున్నారు. రామ మందిర నిర్మాణం పేరిట ట్రస్టు నిధుల సేకరణకు రంగంలోకి దిగితే.. అది కొంత కాలం దేశవ్యాప్తంగా మీడియాను ఆకర్షించకమానదు. 30 ఏళ్ళ క్రితం బీజేపీ నిర్వహించిన రామ జ్యోతులు, ఇటుకల సేకరణ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హిందూ సమాజాన్ని ఎలా మేలుకొలిపాయో… అదే విధంగా రామ మందిర నిర్మాణ నిధుల సేకరణకు కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం ఖాయమని బీజేపీ నేతలు అంఛనా వేస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన ఎజెండాను లైవ్‌లో వుంచేందుకు మోదీ సిద్దమయ్యారన్నది పరిశీలకుల విశ్లేషణ. వాహ్ మోదీజీ..!!