నెహ్రూ ..కాంగ్రెస్.. నిప్పులు చెరిగిన మోదీ

వివాదాస్పద సీఏఏపై కాంగ్రెస్, విపక్షాలు హింసను, అల్లర్లను రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చట్టం మైనారిటీల పట్ల వివక్ష చూపేదిగా ఉందన్న ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, దేశ విభజన, 1975 నాటి ఎమర్జెన్సీ, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. సీఏఏ…  ఏ భారతీయుడిపైనా ప్రభావం చూపదని, మైనారిటీల ప్రయోజనాలకు భంగం కలిగించదని అన్నారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ లోని మైనారిటీలపట్ల  నెహ్రూ అనుసరించిన […]

నెహ్రూ ..కాంగ్రెస్.. నిప్పులు చెరిగిన మోదీ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 5:34 PM

వివాదాస్పద సీఏఏపై కాంగ్రెస్, విపక్షాలు హింసను, అల్లర్లను రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చట్టం మైనారిటీల పట్ల వివక్ష చూపేదిగా ఉందన్న ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, దేశ విభజన, 1975 నాటి ఎమర్జెన్సీ, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. సీఏఏ…  ఏ భారతీయుడిపైనా ప్రభావం చూపదని, మైనారిటీల ప్రయోజనాలకు భంగం కలిగించదని అన్నారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ లోని మైనారిటీలపట్ల  నెహ్రూ అనుసరించిన విధానాలను ఆయన ప్రస్తావించారు. భారత ప్రధాని కావాలన్నది ఒకరి ఆశయమైనప్పుడు దేశ మ్యాప్ పై ఒక రేఖను గీశారు . దాంతో ఈ దేశం రెండుగా చీలిపోయింది’ అని మోదీ అన్నారు. దేశ విభజన తరువాత హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీల పట్ల వివక్ష ఎలా చూపారో ఊహించలేమన్నారు.

1950 లో నెహ్రూ -నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీ మధ్య ఒప్పందం కుదిరినప్పుడు పాక్ కు వ్యతిరేకంగా మైనారిటీల పట్ల వివక్ష చూపే ప్రసక్తి ఉండదని పేర్కొన్నారని, కానీ.. నెహ్రూ వంటి సెక్యులర్ వ్యక్తి, దూరదృష్టి గల నేత మైనారిటీల పట్ల వివక్ష చూపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఏదో ఒక కారణం ఉంటుందన్నారు. విభజన తరువాత భారత-పాకిస్థాన్ దేశాల మధ్య పెద్ద సంఖ్యలో మైగ్రేషన్ జరిగిన నేపథ్యంలో వారి మధ్య ఆ ఒడంబడిక కుదిరిందన్నారు. హిందూ,  ముస్లిం శరణార్థులను వేర్వేరుగా పరిగణించాలని నెహ్రూ నాడు అస్సాం ముఖ్యమంత్రికి లేఖ రాశారని మోదీ తెలిపారు. అసలు హిందువులు, ముస్లిముల మధ్య ఆయన వివక్ష చూపారా ? ఆయన హిందూ రాజ్యాన్ని కోరారా అని మోదీ సందేహాలను వెలిబుచ్చారు.