ఆస్తికోసం తల్లిని వేధించిన కొడుకు.. మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడు ఓ ప్రఖ్యాత తత్వవేత్త. ప్రస్తుతం సమాజంలో ఆస్తులకోసం కన్న తల్లిదండ్రులకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్న సుప్రుత్రులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి మరణానంతరం తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకు తల్లి ఆస్తి కోసం ఆమెను వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత కోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నేరేడ్‌మెట్ […]

ఆస్తికోసం తల్లిని వేధించిన కొడుకు..  మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 7:58 PM

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడు ఓ ప్రఖ్యాత తత్వవేత్త. ప్రస్తుతం సమాజంలో ఆస్తులకోసం కన్న తల్లిదండ్రులకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్న సుప్రుత్రులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి మరణానంతరం తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకు తల్లి ఆస్తి కోసం ఆమెను వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత కోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిల్ కాలనీలో నివాసముంటున్న ప్రేమ కుమారి(70)కి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. ఈమె భర్త 2013లో మరణించాడు. భర్త బతికి ఉండగానే అందరికీ పెళ్లిళ్లు చేశారు. పిల్లలకూడా ఎవరికి వారు వేరుగానే కాపురమున్నారు. 2013లో తండ్రి మరణించడంతో పెద్ద కుమారుడి నుంచి తల్లికి వేధింపులు ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్‌లో నివాసముండే పెద్ద కుమారుడు అమిత్‌కుమార్ తన భార్యతో సహా కలిసి తల్లి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమెను బయటకు పంపేందుకు శతవిధాల ప్రయత్నించారు. అప్పటికే అనారోగ్యం పాలైన తల్లిని చిత్రహింసల పాలుచేసి నరకం చూపించాడు.

పెద్ద కొడుకు పెడుతున్న హింసను తట్టుకోలేని తల్లి 2015లో స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై  సుధీర్ఘకాలం పాటు విచారణ జరిపి  నాలుగేళ్ల తర్వాత తుదితీర్పు సోమవారం వెలువరించింది. కన్నతల్లిని చిత్రహింసలపాలు చేసిన కొడుకు, కోడలికి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోపాటు చెరో పదివేల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.