AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. […]

మోగిన ఎన్నికల నగారా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2019 | 6:27 PM

Share

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాం. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని సునీల్‌ అరోరా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదు, ఆరు దశలు మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు అరోడా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు అరోడా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

పోలింగ్‌ స్టేషన్లలో పర్యవేక్షణ, సునిశిత పరిశీలన ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. ఓటు హక్కు వినియోగానికి 12 గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకోనున్నామన్నారు. పోలింగ్‌ కు 5 రోజులు ముందుగా ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుందని.. అయితే ఈ పోల్‌ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోమన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ లు వినియోగిస్తామని తెలిపారు. పర్యావరణహిత ఎన్నికల ప్రచార సామాగ్రి మాత్రమే వినియోగించాలన్నారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లుండగా..వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సున్న ఓటర్లు 1.5 కోట్లున్నారని సీఈసీ తెలిపారు.

ఏడు విడతల్లో లోకసభ ఎన్నికలు

*మార్చి 18న నొటిఫికేషన్‌ విడుదల *ఏప్రిల్‌ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు *మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు *మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు *మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు *మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు