నేటి నుండి అమలులోకి ఎన్నికల కోడ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్నికలకు నగారా మ్రోగింది. 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు చీఫ్ ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రణాళికను విడుదల చేశారు. దీంతో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేశామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ చెప్పారు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికల […]
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్నికలకు నగారా మ్రోగింది. 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు చీఫ్ ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రణాళికను విడుదల చేశారు. దీంతో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేశామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ చెప్పారు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించామని.. పరీక్షలు, పండుగలు అన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ సిద్ధం చేశామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సీఈఓలు, డీజీపీలతో మాట్లాడమని.. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.