AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్‌ఎస్‌లోకి సబితా ఇంద్రారెడ్డి?

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగలనుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సచితా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వారి మధ్య సంధి కుదిర్చినట్లు సమాచారం. ఒవైసీ ఇంట్లోనే కేటీఆర్‌-సబిత భేటీ అయ్యారని, కార్తిక్‌ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన రాహుల్‌ గాంధీ బహిరంగ […]

టీఆర్‌ఎస్‌లోకి సబితా ఇంద్రారెడ్డి?
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2019 | 2:04 PM

Share

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగలనుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సచితా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వారి మధ్య సంధి కుదిర్చినట్లు సమాచారం. ఒవైసీ ఇంట్లోనే కేటీఆర్‌-సబిత భేటీ అయ్యారని, కార్తిక్‌ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన రాహుల్‌ గాంధీ బహిరంగ సభలో కూడా పార్టీ అధిష్టానంపై సబిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆవిడ ఎంపీ కవితతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తుంది. కాగా కేటీఆర్‌తో భేటీ వార్తలపై సబిత ఇప్పటి వరకు స్పందింలేదు.

కాగా ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీపై కార్తిక్‌ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు అధికార టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మరింత పదునుపెట్టింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ కీలకంగా భావించే లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా ముఖ్య నేతలంతా వీడుతుండటం పార్టీ నాయకత్వానికి తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరెంత మంది నేతలు పార్టీకి గుడ్‌బై చెప్తోరోనని పార్టీ నేతల్లో అలజడి మొదలైంది.