ఇవాళ సాయంత్రమే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్, మే నేలల్లో […]
డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్, మే నేలల్లో 7 లేదా 8 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత పోలింగ్ ఉండనున్నట్లు సమాచారం. తొలి విడత పోలింగ్‌కు ఈ నెలాఖరున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది.