నేను పని చేసిన హీరోల కన్నా కోహ్లీ ఎన్నో రెట్లు సూపర్: తమన్నా

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తనకూ మధ్య ఉన్న సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి స్పందించింది. వీరిద్దరూ డేటింగ్ చేశారని గతంలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫేమస్లీ ఫిలింఫేర్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ విషయంపై మాట్లాడుతూ 2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్‌లో నటిస్తున్నప్పుడు మాత్రమే తొలిసారి కలిశానని చెప్పింది. అయితే ఆ సమయంలో కనీసం నాలుగు మాటలు కూడా […]

  • Vijay K
  • Publish Date - 5:26 pm, Fri, 1 March 19
నేను పని చేసిన హీరోల కన్నా కోహ్లీ ఎన్నో రెట్లు సూపర్: తమన్నా

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తనకూ మధ్య ఉన్న సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి స్పందించింది. వీరిద్దరూ డేటింగ్ చేశారని గతంలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫేమస్లీ ఫిలింఫేర్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ విషయంపై మాట్లాడుతూ 2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్‌లో నటిస్తున్నప్పుడు మాత్రమే తొలిసారి కలిశానని చెప్పింది. అయితే ఆ సమయంలో కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని చెప్పింది. ఆ తర్వాత కోహ్లీని కలవలేదు, కనీసం మాట్లాడలేదు. అయితే నేను పనిచేసిన హీరోలతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎన్నో రెట్లు నయం అని చెప్పింది తమన్నా. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌ను తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను కూడా తమన్నా ఖండించింది.