త్వరలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌

గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ కల్పించే ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇప్పటివరకూ చెక్‌ పవర్‌ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని కూడా ఖర్చు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు గత పాలక వర్గాల […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:21 pm, Tue, 5 March 19
త్వరలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌

గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ కల్పించే ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇప్పటివరకూ చెక్‌ పవర్‌ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని కూడా ఖర్చు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు గత పాలక వర్గాల హయాంలో చేసిన అభివృద్ధి పనులకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటి కోసం పంచాయతీల్లో పనులు చేసిన వారు ఎదురు చూస్తున్నారు. చెక్‌ పవర్‌పై ఉత్తర్వులు త్వరగా జారీ చేయాలని, బకాయి బిల్లులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.