AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఇళ్లు ఎక్కడున్నాయో కూడా తెలీడం లేదు

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో దాదాపు 56గంటల పాటు సాగిన భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన బాబా గండ్ గ్రామంలో ఎన్నో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చిన్న తరహా యుద్ధాన్ని తలపించిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఎదురుకాల్పులు ముగిసిన తరువాత గ్రామంలోకి ప్రవేశించిన ప్రజలు వారి ఇళ్లను కూడా గుర్తుపట్టలేకపోయారు. మూడురోజులు బిక్కుమక్కుమంటూ పలు స్థానాల్లో తలదాచుకున్న […]

మా ఇళ్లు ఎక్కడున్నాయో కూడా తెలీడం లేదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:19 PM

Share

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో దాదాపు 56గంటల పాటు సాగిన భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన బాబా గండ్ గ్రామంలో ఎన్నో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చిన్న తరహా యుద్ధాన్ని తలపించిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఎదురుకాల్పులు ముగిసిన తరువాత గ్రామంలోకి ప్రవేశించిన ప్రజలు వారి ఇళ్లను కూడా గుర్తుపట్టలేకపోయారు. మూడురోజులు బిక్కుమక్కుమంటూ పలు స్థానాల్లో తలదాచుకున్న వారు ఎన్‌కౌంటర్ ముగిసిన తరువాత గ్రామాన్ని చూసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఐఏఎఫ్ కమాండర్ వింగ్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగి పంపాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకున్న తరువాత రెండు దేశాల సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో ఉన్నపాటుగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొనడంతో స్థానికులను రక్షణ ప్రాంతాలకు తరలించారు భద్రతాబలగాలు.

ఎన్‌కౌంటర్ ముగిసే వారు వారు బయటకు వచ్చేందుకు భయపడగా.. అన్ని రోజులు ఆహారం, నీరు లేకుండా బాధపడ్డామని గ్రామస్థుడు అర్షద్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘‘మా ఇళ్ల నుంచి మమ్మల్ని బయటకు వెళ్లమన్నారు. ఇప్పుడు మాకు నిలువ నీడ లేకుండా పోయింది. దీన్ని యుద్ధం అనకుండా ఇంకేం అంటారు’’ అంటూ అర్షద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గ్రామస్థుడు ఫయాజ్ షా మాట్లాడుతూ.. ‘‘ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో నేను గ్రామానికి దూరంగా ఉన్నా. ఆ తరువాత వచ్చి చూస్తే నా ఇళ్లు ఎక్కడుందో కూడా గుర్తించలేకపోయా’’ అంటూ తెలిపాడు.

దీనిపై ఆ గ్రామ పన్ను కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘13ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఏడు పశువుల దొడ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇంకా చాలా మంది ఇళ్లులు దెబ్బతిన్నాయి. ఎంతోమందికి పశుపోషణే ఆధారంగా బతుకుతున్నారు. ఈ నష్టపరిహారాన్ని పూడ్చుకునేందుకు గ్రామస్థులకు కొన్ని సంవత్సరాలు పడుతుంది’’ అన్నాడు.

అయితే పుల్వామా ఉగ్రదాడి తరువాత జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వరుసగా ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అందులో 12మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ, 12మంది జవాన్లు, పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కశ్మీర్ లోయలో ఇంకా 55 నుంచి 60మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us