ఎల్‍వోసీ వైపు తరలుతున్న పాక్ బల‌గాలు

ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఈ మేరకు ఇవాళ ఓ సంచలన కథనం వెలువరించింది. బలోచిస్తాన్, గిరిజన ప్రాంతాలను వదిలిపెట్టి పాక్ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వైపు తరలుతున్నట్టు పేర్కొంది. రిపబ్లిక్ కథనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్, బన్ను, జానిఖేల్ ప్రాంతాల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో సైనిక బృందాలు బయల్దేరాయి. సైనిక అవసరాలకు కావాల్సిన వస్తువులను తరలించేందుకు ట్రక్కులు, బస్సులు, ప్యాసెంజర్ బస్సులను పాక్ సైన్యం ఉపయోగిస్తోంది. మరోవైపు జనరల్ ఖమర్ […]

ఎల్‍వోసీ వైపు తరలుతున్న పాక్ బల‌గాలు

ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఈ మేరకు ఇవాళ ఓ సంచలన కథనం వెలువరించింది. బలోచిస్తాన్, గిరిజన ప్రాంతాలను వదిలిపెట్టి పాక్ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వైపు తరలుతున్నట్టు పేర్కొంది. రిపబ్లిక్ కథనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్, బన్ను, జానిఖేల్ ప్రాంతాల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో సైనిక బృందాలు బయల్దేరాయి. సైనిక అవసరాలకు కావాల్సిన వస్తువులను తరలించేందుకు ట్రక్కులు, బస్సులు, ప్యాసెంజర్ బస్సులను పాక్ సైన్యం ఉపయోగిస్తోంది. మరోవైపు జనరల్ ఖమర్ జావేద్ భజ్వా సారథ్యంలోని పాక్ సైన్యం తాలిబన్లతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని పెంచి పోషించడం వల్లే శాంతికి విఘాతం కలుగుతోందంటూ భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు పొరుగు దేశాల నుంచి తీవ్ర ఆగ్రహం వస్తున్నప్పటికీ పాక్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాలతో పాటు పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్, పస్తూన్ గిరిజన తెగల నుంచి భారత్‌కు పెద్దఎత్తున మద్దతు, సంఘీభావం లభించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu