AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీవీకి ‘భారతరత్న’ ఇవ్వాలని డిమాండ్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గ పీవీ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పిడిశెట్టి రాజు చేపట్టిన 63 రోజుల బైక్‌ యాత్ర సోమవారం ముగిసింది. డిసెంబరు 23న యాత్ర ప్రారంభించిన రాజు తెలంగాణలోని ఎనిమిది జిల్లాల మీదుగా తిరుగుతూ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోగా పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు, సర్పంచ్‌ ఆలూరి రజితలు రాజుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ ఆర్ధికసంస్కరణలు ప్రవేశపెట్టి,దేశాభివృద్ధికి […]

పీవీకి 'భారతరత్న' ఇవ్వాలని డిమాండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2019 | 4:02 PM

Share

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గ పీవీ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పిడిశెట్టి రాజు చేపట్టిన 63 రోజుల బైక్‌ యాత్ర సోమవారం ముగిసింది. డిసెంబరు 23న యాత్ర ప్రారంభించిన రాజు తెలంగాణలోని ఎనిమిది జిల్లాల మీదుగా తిరుగుతూ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోగా పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు, సర్పంచ్‌ ఆలూరి రజితలు రాజుకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ ఆర్ధికసంస్కరణలు ప్రవేశపెట్టి,దేశాభివృద్ధికి ఎంతో కృషి చేసిన పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాకు పీవీ నామకరణం చేయాలని పేర్కొన్నారు.

Follow Us