కాబోయే యూఎస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన.. చైనా లెక్కలు తేల్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓలో చేరుతామన్న బైడెన్..
అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్ ప్రకటించారు.
అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్ ప్రకటించారు. అలాగే సంస్థలోని సభ్య దేశం చైనా రూల్స్ ప్రకారం నడుచుకుంటుందో లేదో తాను నిర్ధారించుకోవాలనుకుంటున్నాని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో భాగంగా చైనా గురించి బైడెన్ చేసిన ప్రకటనలనుద్దేశించి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చారు. కాగా, కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆ దేశం చెప్పినట్లు ఆరోగ్య సంస్థ నడుచుకుంటుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్‌ఓతో తెగదెంపులు చేసుకున్నారు. తాజాగా బైడెన్ ప్రకటనతో ప్రధాన్యత సంతరించుకుంది.
‘చైనాను శిక్షించడం విషయం కాదు. నిబంధనల ప్రకారం ఆ దేశం వ్యవహారిస్తుందా లేదన్నది చూడాల్సి ఉందన్నారు బైడెన్. మేము మొదటి రోజే సంస్థలో తిరిగి చేరబోతున్నాం. అలాగే దానిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందంలో కూడా తిరిగి చేరతామన్నారు. మనం, మిగతా ప్రపంచం కలిసే ఉన్నామనే విషయాన్ని చాటాలని గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్ స్పష్టం చేశారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అమెరికా, చైనా సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్ ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలుగా మారాయి. కరోనాను ‘చైనా వైరస్’ అంటూ ట్రంప్ పలుమార్లు ఆదేశంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ చాకుతోనే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, బైడెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ దేశాలన్నింటితో స్నేహభావం కలగి ఉండాలన్ని సంకేతాలు వెలువడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.