ఆ సర్వే ఇచ్చిన షాక్ తో… డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు

అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో సి.ఎమ్ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల మీద వరాలు జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదానే అక్కర్లేదు అన్న ఆయన ఇప్పుడు ఆ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రతిపక్షాల ఎద్దేవా చేస్తున్నారట. సడన్ గా వచ్చిన ఈ మార్పు చూసి అటు పార్టీ కార్యకర్తల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చలు మొదలయ్యాయట.అయితే దీని వెనక ఉన్న అసలు కారణం ఒక జాతీయ మీడియా చేసిన సీక్రెట్ సర్వేనే.       అసలు […]

ఆ సర్వే ఇచ్చిన షాక్ తో... డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:22 PM

అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో సి.ఎమ్ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల మీద వరాలు జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదానే అక్కర్లేదు అన్న ఆయన ఇప్పుడు ఆ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రతిపక్షాల ఎద్దేవా చేస్తున్నారట. సడన్ గా వచ్చిన ఈ మార్పు చూసి అటు పార్టీ కార్యకర్తల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చలు మొదలయ్యాయట.అయితే దీని వెనక ఉన్న అసలు కారణం ఒక జాతీయ మీడియా చేసిన సీక్రెట్ సర్వేనే.      

అసలు విషయంలోకి వెళ్తే కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో జాతీయ సంస్థ ఇండియా టుడే సీక్రెట్ గా ఒక సర్వే చేశారట. ఆ సర్వేలో చంద్రబాబు అండ్ కో పై ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రజాభిప్రాయం సేకరించగా టీడీపీకి 34 శాతం, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి 66 శాతం మంది అనుకూలంగా స్పందించారని తెలుస్తోంది.  

ఈ షాక్ తో సి.ఎమ్ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి జనాల మీద ఎక్కడలేని ప్రేమను చూపిస్తూ వరాలు కురిపిస్తున్నారని వినికిడి. అయితే ఇలాంటివి ఎన్ని చేసినా ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా చెప్పాలంటే సొంత గూటి పక్షులే వేరే పార్టీకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో డిఫెన్స్ లో పడిన చంద్రబాబు ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితులలో ఉన్నాడని పార్టీ టాక్.

చూడాలి ఈసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందో.. లేక అధికార టీడీపీ పార్టీ మళ్ళీ చక్రం తిప్పుతుందో.?