సీక్రెట్ మిషన్ చేస్తున్న తెలుగు హీరోలు… ఎందుకో తెలుసా

సీక్రెట్ మిషన్ చేస్తున్న తెలుగు హీరోలు… ఎందుకో తెలుసా

హాలీవుడ్ లో తెరకెక్కించే జేమ్స్ బాండ్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు తెలుగు హీరోలు కూడా జేమ్స్ బాండ్ తరహా సీక్రెట్ ఏజంట్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాలని తహతహలాడుతున్నారు.  గతేడాది అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి‘ సినిమా కూడా జేమ్స్ బాండ్ తరహా చిత్రమే. ఇందులో అడివి శేష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక […]

TV9 Telugu Digital Desk

|

Feb 20, 2019 | 12:29 PM

హాలీవుడ్ లో తెరకెక్కించే జేమ్స్ బాండ్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు తెలుగు హీరోలు కూడా జేమ్స్ బాండ్ తరహా సీక్రెట్ ఏజంట్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాలని తహతహలాడుతున్నారు.  గతేడాది అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి‘ సినిమా కూడా జేమ్స్ బాండ్ తరహా చిత్రమే.

ఇందులో అడివి శేష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది.

ఇది మాత్రమే కాదు అంతకముందు చాలామంది హీరోలు ఇదే తరహాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలు చేసి మెప్పించారు. నటుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా తన నటవిశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి పార్ట్ హిట్ అయినా రెండోది మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

మరోవైపు మహేష్ బాబు స్పైడర్ లో, బాలయ్య పైసా వసూల్ లో, ఎన్టీఆర్ శక్తి సినిమాల్లో ఇలాంటి తరహా సీక్రెట్ ఏజెంట్ పాత్రలే చేశారు.  కానీ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్స్ చవి చూశాయి. అటు సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ‘గరుడవేగ’ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రే చేశాడు. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాదు రాజశేఖర్ హీరోగా కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

ఇవి మాత్రమే కాదు ప్రభాస్ ‘సాహో’లో, విక్రమ్ ‘ ధృవనచ్చత్రం’ లో , సూర్య ‘కప్పన్’ లో ఇలాంటి తరహా సీక్రెట్ ఏజెంట్స్ పాత్రలే చేస్తున్నారు.   

తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సీక్రెట్ ఏజెంట్ పాత్రలంటే ముందుగా మనకు సూపర్ స్టార్ కృష్ణగారు గుర్తొస్తారు. ఈయన ఎన్నో సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ తరహా పాత్రలు చేసి మెప్పించారు. ఇలా తర్వాత వచ్చిన కథానాయకులు వెండితెరపై సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో మెప్పించడం విశేషం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu