వైసీపీకి ఓటేస్తే అది కేసీఆర్ గెలుపు: చంద్రబాబు
పలమనేరు: వైసీపీకి ఓటు వేస్తే అది కేసీఆర్ గెలుపు అని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ తాను అండగా ఉంటానని, అందరినీ కాపాడుకుంటానని చెప్పారు. నేనొక సైనికుడిని, మీ హక్కుల కోసం పోరాడతా, నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు అన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత ఆదరణ చూడలేదని, మీ అందరికీ పాదాభివందనం […]
పలమనేరు: వైసీపీకి ఓటు వేస్తే అది కేసీఆర్ గెలుపు అని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ తాను అండగా ఉంటానని, అందరినీ కాపాడుకుంటానని చెప్పారు. నేనొక సైనికుడిని, మీ హక్కుల కోసం పోరాడతా, నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు అన్నారు.
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత ఆదరణ చూడలేదని, మీ అందరికీ పాదాభివందనం అని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాది. 150 పడకలతో పలమనేరులో ఏరియా ఆస్పత్రి నిర్మిస్తాం అని చంద్రబాబు చెప్పారు. కబడ్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు, వైసీపీని అడ్డుపెట్టుకుని మా జోలికొస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నరేంద్ర మోడీకి వైసీపీ నేతలు ఊడిగం చేస్తున్నారు. వైసీపీకి ఓటు వస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని, ఇప్పుడు పోరాటం మనకు కేసీఆర్‌కు అని, మనకు జగన్‌కు కాదని చంద్రబాబు అన్నారు.