నేను రౌడీనైతే ప్రత్యర్ధులు ప్రచారం చేయగలుగుతారా?: పరిటాల శ్రీరామ్

రాప్తాడు: నేను రౌడీనైతే ప్రత్యర్ధులు ప్రచారం చేయగలుగుతారా? అని పరిటాల శ్రీరామ్ అన్నారు. తనను రౌడీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, రౌడీ అయితే తనకు ఎదురు నిలబడి పోటీ చేసే అవకాశాలే ఉండవని శ్రీరామ్ అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ప్రత్యర్ధులకు చెప్పుకునేందుకు వేరే విషయాలేమీ లేకపోవడంతోనే తనపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని శ్రీరామ్ అన్నారు. గతంలో తాను ఏమీ చేయలేదని, ఇప్పుడు కొత్తగా చేసేదేముంటుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను బట్టి స్పందించడం జరుగుతుందే తప్ప […]

నేను రౌడీనైతే ప్రత్యర్ధులు ప్రచారం చేయగలుగుతారా?: పరిటాల శ్రీరామ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2019 | 7:26 PM

రాప్తాడు: నేను రౌడీనైతే ప్రత్యర్ధులు ప్రచారం చేయగలుగుతారా? అని పరిటాల శ్రీరామ్ అన్నారు. తనను రౌడీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, రౌడీ అయితే తనకు ఎదురు నిలబడి పోటీ చేసే అవకాశాలే ఉండవని శ్రీరామ్ అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ప్రత్యర్ధులకు చెప్పుకునేందుకు వేరే విషయాలేమీ లేకపోవడంతోనే తనపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని శ్రీరామ్ అన్నారు. గతంలో తాను ఏమీ చేయలేదని, ఇప్పుడు కొత్తగా చేసేదేముంటుందని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలను బట్టి స్పందించడం జరుగుతుందే తప్ప తాము ఎక్కడా సొంత రాజకీయాల కోసం పనిచేయలేదని అన్నారు.  తన తాత, తండ్రి, అమ్మ చేసిన ప్రజా సేవను కొనసాగిస్తానని, రాప్తాడు ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడమే తన లక్ష్యమని శ్రీరామ్ వెల్లడించారు.