యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సరిహద్దులు

న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా.. మరోవైపు యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. దీనికి కారణం తరుచూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటమే. అయితే పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు భారత్ సమర్ధంగా తిప్పికొడుతోంది. కాగా భారత పైలట్ అభినందన్‌ను పాక్ రెండు రోజుల్లోనే విడుదల చేయడంతో క్రమంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే సరిహద్దుల్లో మాత్రం భారత బలగాలు తమ కసరత్తులు కొనసాగిస్తునే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి జమ్ము, […]

యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సరిహద్దులు
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 6:28 PM

న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా.. మరోవైపు యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. దీనికి కారణం తరుచూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటమే. అయితే పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు భారత్ సమర్ధంగా తిప్పికొడుతోంది. కాగా భారత పైలట్ అభినందన్‌ను పాక్ రెండు రోజుల్లోనే విడుదల చేయడంతో క్రమంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే సరిహద్దుల్లో మాత్రం భారత బలగాలు తమ కసరత్తులు కొనసాగిస్తునే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి జమ్ము, పంజాబ్ రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిహార్సల్ నిర్వహించాయి. ఇందులో ఐఏఎఫ్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్స్ పాల్గొనడం విశేషం. సూపర్‌సానిక్ స్పీడ్‌తో ఈ జెట్స్ గాల్లో దూసుకెళ్లాయి. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మరో దుస్సాహసానికి తెగబడితే తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉండటంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. బాలాకోట్‌లో దాడులు చేసిన వచ్చినప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైఅలెర్ట్‌లో ఉంది. మరుసటి రోజే పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ భారత గగనతలంలోకి దూసుకొచ్చినా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. రెండు రోజుల కిందట మరోసారి పాక్‌కు చెందిన ఫైటర్ జెట్స్ ఎల్‌వోసీకి పది కిలోమీటర్ల దూరంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సూపర్‌సోనిక్ స్పీడ్‌తో వచ్చి. .అంతే వేగంగా తిరుగుముఖం పట్టాయి. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్ ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే.. ఈ సారి తగిన రీతిలో బుద్దిచెప్పేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..