హాయ్ గూగుల్.. అభినందన్ కులం ఏమిటి?

న్యూఢిల్లీ: దేశం తరుపున వీరోచితంగా పోరాడిన అభినందన్ ఇప్పుడు భరత జాతికి హీరోగా మారారు. పాక్ చెర నుంచి బయటపడి భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ ఇంటర్నెట్‌లో ఆయన గురించి విపరీతంగా వెతుకులాడారు. నెటిజన్లు గూగుల్‌లో విపరీతంగా వెతికింది ఆయన సాధించిన విజయాలు, ఆయన ధైర్య సాహసాల గురించి అయితే ఆశ్చర్యం లేదు. కానీ అభినందన్ కులం ఏమిటీ? ఆయన జైనుడా? అంటూ వెతుకులాడారు. అభినందన్ క్యాస్ట్, అభినందన్ వర్ధమాన్ క్యాస్ట్, వర్ధమాన్ క్యాస్ట్ అంటూ పలు […]

  • Updated On - 4:36 pm, Sat, 2 March 19
హాయ్ గూగుల్.. అభినందన్ కులం ఏమిటి?

న్యూఢిల్లీ: దేశం తరుపున వీరోచితంగా పోరాడిన అభినందన్ ఇప్పుడు భరత జాతికి హీరోగా మారారు. పాక్ చెర నుంచి బయటపడి భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ ఇంటర్నెట్‌లో ఆయన గురించి విపరీతంగా వెతుకులాడారు. నెటిజన్లు గూగుల్‌లో విపరీతంగా వెతికింది ఆయన సాధించిన విజయాలు, ఆయన ధైర్య సాహసాల గురించి అయితే ఆశ్చర్యం లేదు. కానీ అభినందన్ కులం ఏమిటీ? ఆయన జైనుడా? అంటూ వెతుకులాడారు.

అభినందన్ క్యాస్ట్, అభినందన్ వర్ధమాన్ క్యాస్ట్, వర్ధమాన్ క్యాస్ట్ అంటూ పలు విధాలుగా శోధించారు. సహజంగా వర్ధమాన్లు ఏ కులం వారు అయి ఉంటారనే విధంగా శోధనలు చేశారు. ఈ విధంగా అభినందన్ కులం కోసం వెతికిన వారిలో గుజరాతీయులు మొదటి స్థానంలో నిలిచారు. ఎక్కువగా వెతికన ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దేశం మొత్తానికి ప్రతినిధి అయిన అభినందన్ కులం గురించి ఇలా వెతకడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మన భారతీయులకు ఈ కులం పిచ్చి పట్టి పీడిస్తుదంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు.