బెజవాడ కృష్ణమ్మ ఉగ్రరూపం.!

ఎగువున విస్తారంగా కురిసిన వర్షాలతో బెజవాడ కృష్ణమ్మకు వరద ఉధృతి బాగా పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579, అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి ఎగువనున్న పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 4 60 000 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను […]

బెజవాడ కృష్ణమ్మ ఉగ్రరూపం.!
Follow us

|

Updated on: Sep 27, 2020 | 10:20 AM

ఎగువున విస్తారంగా కురిసిన వర్షాలతో బెజవాడ కృష్ణమ్మకు వరద ఉధృతి బాగా పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579, అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి ఎగువనున్న పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 4 60 000 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత మండలాల అధికారులకు సూచనలు జారీ చేశారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రకాశం బ్యారేజి దిగువ లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని తెలిపారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయొద్దని హెచ్చరికలు జారీచేశారు. ఈ రోజు 11.30 గంటల సమయానికి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?