వారెవ్వా.. జనవరిలోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు..

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలు జనవరిలో రూ 1.1 లక్షల కోట్లు దాటాయని అధికార వర్గాలు తెలిపాయి.   జూలై 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత నెలవారీ ఆదాయం రూ 1 లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో సీనియర్  అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం… రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నిర్దేశించిన లక్ష్యానికి అనుకూలంగా వసూళ్లు ఉన్నాయి. 2019 జనవరిలో ఆదాయంతో పోలిస్తే..ఈ ఏడాది జనవరి ఆదాయం […]

వారెవ్వా.. జనవరిలోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 01, 2020 | 1:42 PM

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలు జనవరిలో రూ 1.1 లక్షల కోట్లు దాటాయని అధికార వర్గాలు తెలిపాయి.   జూలై 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత నెలవారీ ఆదాయం రూ 1 లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో సీనియర్  అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం… రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నిర్దేశించిన లక్ష్యానికి అనుకూలంగా వసూళ్లు ఉన్నాయి. 2019 జనవరిలో ఆదాయంతో పోలిస్తే..ఈ ఏడాది జనవరి ఆదాయం 12 శాతం వృద్ధిని కనబరిచినట్లు తెలుస్తోంది. జనవరి నెలలో దేశీయ జీఎస్టీ వసూలు రూ .86,453 కోట్లు కాగా, ఐజిఎస్‌టి, సెస్ కలెక్షన్ ద్వారా రూ .23,597 కోట్లు వసూలు చేశారు. డిసెంబరులో జీఎస్టీ ఆదాయం మొత్తం రూ 1.03 లక్షల కోట్లు ఉంది. ఈ గురువారం( జనవరి 30) నాటికి మొత్తం 82.8 లక్షల జీఎస్టీఆర్​ 3బీ రిటర్నులు దాఖలైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

  • సెంట్రల్ జీఎస్టీ రూ.20,944 కోట్లు
  • స్టేట్స్ జీఎస్టీ రూ.28,224 కోట్లు
  • సమీకృత​ జీఎస్టీ రూ.53,013 కోట్లు
  • సెస్ రూ.8,637 కోట్లు
  •  మొత్తం రూ.1,10,828 కోట్లు