ఐటీ స్లాబు రేట్ల పెంపు..పన్ను రేట్ల తగ్గింపు: వేతనజీవులకు ఊరట
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయపన్నులో ఇతోధికంగా ప్రయోజనం కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయ పన్ను స్లాబు రేట్లను గణనీయంగా పెంచారు. వివిధ స్థాయిల వేతన జీవులకు వేర్వేరు ఆదాయపన్ను స్లాబురేట్లను సృష్టించారు. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లుగానే 5 లక్షల రూపాయల వేతనం పొందుతున్న వారు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించనవసరం లేదని నిర్మల వెల్లడించారు. కొత్త స్లాబుల ప్రకారం 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల కేవలం పది శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి వుంటుంది. […]
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయపన్నులో ఇతోధికంగా ప్రయోజనం కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయ పన్ను స్లాబు రేట్లను గణనీయంగా పెంచారు. వివిధ స్థాయిల వేతన జీవులకు వేర్వేరు ఆదాయపన్ను స్లాబురేట్లను సృష్టించారు.
గత బడ్జెట్‌లో ప్రకటించినట్లుగానే 5 లక్షల రూపాయల వేతనం పొందుతున్న వారు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించనవసరం లేదని నిర్మల వెల్లడించారు.
కొత్త స్లాబుల ప్రకారం 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల కేవలం పది శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి వుంటుంది. ఏడున్నర లక్షల నుంచి 10 లక్షల వార్షిక వేతనం కలిగి వున్న వారు, వార్షిక సంపాదన వున్న ఇండివిజువల్స్ 15 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి వుంటుంది. పది లక్షల నుంచి పన్నెండున్నర లక్షల వరకు వార్షిక ఆదాయం వున్న వారు 20 శాతం ఇన్‌కమ్‌టాక్స్ చెల్లించాల్సి వుంటుంది. పన్నెండున్నర లక్షల నుంచి పదిహేను లక్షల వార్షిక ఆదాయం వున్న వారు 25 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి వుంటుంది. పదిహేను లక్షలకు పైగా వార్షిక ఆదాయం కలిగిన వారు 30 శాతం ఆదాయం చెల్లించాల్సి వుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వివరించారు.
NEW INCOME TAX SLAB RATES FOR 2020-2021 FISCAL YEAR (1) Upto 5,00,000 – No Income Tax (2) 5,00,00 to 7,50,000 – 10% (3) 7,00,000 to 10,00,000 – 15% (4) 10,00,000 to 12,50,000 – 20% (5) 12,00,000 to 15,00,000 – 25% (6) 15,00,000 and above – 30%