Breaking news on Polavaram: పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త డైరెక్షన్

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు ఇవ్వాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

Breaking news on Polavaram: పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త డైరెక్షన్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 20, 2020 | 2:32 PM

Green tribunal new directions on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు ఇవ్వాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్‌కు వివరాలు ఇవ్వకపోవడంపై గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోల‌వ‌రం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను త‌మ‌కు కూడా అంద‌జేయాల‌ని జాతీయ హ‌రిత ట్రిబ్యూన‌ల్ పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఆదేశాలిచ్చింది. డ్యాం ఎత్తు పెంపుతో కలిగే ముంపుపై స్పష్టమైన సమాచారం ఇప్పటివరకు ఇవ్వలేదని పిటీషన్ తరపు న్యాయవాది శ్రావణ్.. జస్టిస్ ఏ కే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆ నివేదికలను ఎన్జీటీతో పాటూ, పిటీషనర్‌కు అందించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది ఎన్జీటీ ధర్మాసనం.

Also read: AP BJP office bearers meeting