Chandrababu assets: చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల చిట్టా తేలింది
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తులను వెల్లడించారు ఆయన తనయుడు నారా లోకేశ్. ఫ్యామిలీలో తన మనవడు దేవాన్ష్ కంటే కూడా చంద్రబాబుకు అతి తక్కువ ఆస్తులున్నట్లు తెలియజేశారు.
Chandrababu family discloses assets list: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ తమ ఆస్తుల చిట్టా విప్పింది. చంద్రబాబు, లోకేశ్, భవనేశ్వరి, బ్రాహ్మణిలతోపాటు చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆస్తుల లెక్కలను బాబు ఫ్యామిలీ స్వయంగా విడుదల చేసింది. ప్రతీ ఏడు విడుదల చేస్తున్నట్లుగానే ఈసారి కూడా బాబు ఫ్యామిలీ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ‘‘తుగ్లక్ జగన్ లాగా బినామిలు ద్వారా మేము ఆస్తులు కొనలేదు.. ఇళ్లు కట్టలేదు.. జగన్ 43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ చెప్పింది.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు.. అమరావతి రాజధాని ప్రాంతంలో మాకు ఎక్కడా భూములు లేవు.. గజం ఉన్నా తీసుకొండి.. ప్రతి ఒక్కరినీ లోకేష్ బినామీ అంటున్నారు.. మరి ఎందుకు నిరూపించడం లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్.
అతి తక్కువ ఆస్తులు బాబుకే
చంద్రబాబుకు కేవలం 9 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే వున్నాయని చెప్పుకొచ్చిన లోకేశ్ ఆయన అప్పులు అయిదు కోట్ల 13 లక్షలని వివరించారు. గత ఏడాది కంటే చంద్రబాబు ఆస్తుల విలువ 85 లక్షలు పెరిగిందని చెప్పారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు 50 కోట్ల 62 లక్షలని పేర్కొన్నారు. గత ఏడాదిలో అమె ఆస్తుల విలువ 3 కోట్లు తగ్గిందన్నారు. తనకు 24 కోట్ల 70 లక్షల రూపాయల ఆస్తులుండగా.. గత ఏడాది కాలంలో వాటి విలువ రెండున్నర కోట్లు తగ్గిందని లోకేశ్ వివరించారు. తన సతీమణి, నారా బ్రాహ్మణి ఆస్తులు 24 కోట్ల 70 లక్షలు కాగా.. తన కుమారుడు దేవాన్ష్ ఆస్తులు పందొమ్మిది లక్షల 42 లక్షలుగా పేర్కొన్నారు. మొత్తమ్మీద చంద్రబాబు తన కుటుంబంలో అందరి కంటే అతి తక్కువ, చివరికి తన మనవడ దేవాన్ష్ కంటే కూడా ఆస్తులను కలిగి వున్నారని వెల్లడించారు నారాలోకేశ్.
Also read: BJP leaders anger on AP CM Jagan