సూపర్ మార్కెట్లపై ఉక్కుపాదం.. లాక్‌డౌన్ కఠినతరం

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న సూపర్ మార్కెట్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధపడుతున్నారు. సోషల్ డిస్టెన్స ఇంగ్ ఏర్పాట్లు చేయకుండా సూపర్ మార్కెట్లలో క్రయవిక్రయాలకు పాల్పడుతున్న పలు సూపర్ మార్కెట్లను జిహెచ్ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు.

సూపర్ మార్కెట్లపై ఉక్కుపాదం.. లాక్‌డౌన్ కఠినతరం
Follow us

|

Updated on: Apr 26, 2020 | 1:14 PM

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న సూపర్ మార్కెట్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధపడుతున్నారు. సోషల్ డిస్టెన్స ఇంగ్ ఏర్పాట్లు చేయకుండా సూపర్ మార్కెట్లలో క్రయవిక్రయాలకు పాల్పడుతున్న పలు సూపర్ మార్కెట్లను జిహెచ్ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు.

చందా నగర్ లోని విజేత సూపర్ మార్కెట్ మధుర నగర్ లోని వ్యాలీ మార్ట్ సూపర్ మార్కెట్లను జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ బృందం శనివారం సీజ్ చేసింది. ఈ సూపర్ మార్కెట్లలో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కువమందిని లోపలికి అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు జిహెచ్ఎంసి అధికారులు గుర్తించారు. కౌంటర్ల దగ్గర అ ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు గుంపుగా చేరడం వల్ల కరుణ ప్రబలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసిన తర్వాతనే సూపర్ మార్కెట్లను తెరవాలని అధికారులు ఆదేశించారు.

సూపర్ మార్కెట్లను తెరిచే ముందు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిహెచ్ఎంసి అధికారులు సూపర్ మార్కెట్ల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. అయితే తాము వీలైనంత మటుకు నిబంధనలు పాటిస్తున్నామని, ప్రజలు ఒకేసారి పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు గుమి కూడక తప్పడంతప్పడం లేదని సూపర్ మార్కెట్ యాజమాన్యాలు వాదిస్తున్నాయి. లాక్ డౌన్ వంటి క్లిష్ట సమయాలలో ప్రజలకు నిత్యవసర వస్తువులను, సరుకులను విక్రయిస్తున్న తమపై చర్యలు తీసుకోవడం సరికాదని వారు చెబుతున్నారు.

కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ పీరియడ్, భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూపర్ మార్కెట్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు. ప్రజలు సైతం ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని వారు చెబుతున్నారు.

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..