Breaking News: తలసానికి షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. ఏకంగా ఫైన్

GHMC shocks Telangana minister Talasani Srinivas Yadav: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు షాకిచ్చింది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ). ఏకంగా అయిదువేల రూపాయలు ఫైన్ వేసింది. విశేషమేంటంటే.. తలసాని చేసిన నేరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడమే. శనివారం మధ్యాహ్నం ఈ ఉదంతం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న వి లవ్ కేసీఆర్ అంటూ మొక్కలు నాటే […]

Breaking News: తలసానికి షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. ఏకంగా ఫైన్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 15, 2020 | 6:00 PM

GHMC shocks Telangana minister Talasani Srinivas Yadav: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు షాకిచ్చింది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ). ఏకంగా అయిదువేల రూపాయలు ఫైన్ వేసింది. విశేషమేంటంటే.. తలసాని చేసిన నేరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడమే. శనివారం మధ్యాహ్నం ఈ ఉదంతం చోటుచేసుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న వి లవ్ కేసీఆర్ అంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి తలసాని పిలుపునిచ్చారు. పిలుపునివ్వడంతోపాటు.. ఓ భారీ హోర్డింగ్‌ను రూపొందించి జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో వున్న ఓ కూడలిలోని పార్కులో ఏర్పాటు చేశారు. చూపరులను విశేషంగా ఆకర్షించిన ఈ హోర్డింగ్.. జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది.

అనుమతి లేకుండా పబ్లిక్ ఏరియాలో హోర్డింగ్ ఏర్పాటు చేస్తారా అంటూ శనివారం మధ్యాహ్నం మంత్రికి ఏకంగా అయిదు వేల రూపాయలు అపరాధ రుసుము విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. చేసేదేమీ లేక ఫైన్ కట్టేందుకు మంత్రి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Also read: Former cricketer became cheater in the name of minister KTR’s PA