AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్‌కు చెక్ పెట్టే ఆహారం…ఈ ఐదు తప్పని సరి: నిపుణులు

కరోనా వైరస్ తక్కువ కాలంలోనే అత్యంత తీవ్రంగా మారడమే కాకుండా, ఆక్సిజన్ ప్రసరింప జేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలు కూడా బలహీనమవుతాయని...

కరోనా వైరస్‌కు చెక్ పెట్టే ఆహారం...ఈ ఐదు తప్పని సరి: నిపుణులు
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2020 | 11:33 AM

Share

కరోనా వైరస్ తక్కువ కాలంలోనే అత్యంత తీవ్రంగా మారడమే కాకుండా, ఆక్సిజన్ ప్రసరింప జేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలు కూడా బలహీనమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ..శరీరంలో వైరస్‌ని ఎదుర్కొగల రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్లయితే, దానిని వైరస్ బారిన పడకుండా ఉండగలమంటున్నారు నిపుణులు. ఈ వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, B, C, D, E తోపాటూ.. మినరల్స్ ఐరన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు.

1. విటమిన్ A : చర్మ కణాలు చక్కగా ఉండేలా చేస్తుంది. పొట్ట, శ్వాసనాళం పనిచేసేందుకు ఏ విటమిన్ తప్పనిసరి. సముద్ర చేపలు, గుడ్లు, వెన్న, బాదం, పిస్తా వంటి పప్పులు, గింజలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, క్యారట్, ఆకు కూరల్లో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.

2. విటమిన్ B: ఇది కొన్ని విటమిన్ల గ్రూపు. ఇవి బాడీలో నిల్వ ఉంటాయి. ముఖ్యంగా B6, B9, B12 విటమిన్లు శరీరంలో చేరిన సూక్ష్మక్రిములు, వైరస్ లాంటి వాటిని అంతచేస్తాయి. తృణధాన్యాలు, గింజలు, ఆకు కూరలు, పండ్లు, పప్పులు, చికెన్, మటన్, గుడ్లు, సోయా మిల్క్ వంటివి వాటిల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

3. విటమిన్ C, E : విటమిన్ C, E విటమిన్లు కూడా కరోనా వైరస్‌ని ఎదుర్కొవటంలో ఎంతగానో తొడ్పడతాయట. ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే… కమలాలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, బెర్రీస్, కివి ఫ్రూట్, బ్రకోలీ, టమాటాలు, కాప్సికం, పప్పులు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు.

4. విటమిన్ D : శరీరానికి కావాల్సిన ఎక్స్‌ట్రా ఎనర్జీ లాంటిది విటమిన్ డీ. అందువల్ల మీరు ఇంట్లో ఉన్నా… ఎండ తగిలేలా చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వరండాలో ఓ పావు గంట గడపాలి. అలాగే గుడ్లు, చేపలు, పాలు బాగా తీసుకోవాలి. తద్వారా వైరస్‌ని ఎదుర్కొగల శక్తి సామర్థ్యా

5. ఐరన్, జింక్, సెలెనియం: కణాలు పెరగాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా… వైరస్‌తో పోరాడాలన్నా… ఐరన్, జింక్, సెలెనియం కూడా చాలా అవసరం. తృణధాన్యాల్లో ఇలాంటి శక్తి ఉంటుంది. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కస్తూరి ఆకులు, అల్లం, వెల్లుల్లి… ఇలా వీలైనన్ని ఎక్కువ ఐటెమ్స్ ఈ టైమ్‌లో వాడాలి. ఇవన్నీ మనకు మేలు చేసేవే.

ఇలాంటి పౌష్టికాహారం తీసుకుంటూ..పలు రకాల వ్యాయమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పరిశుభ్రత, పరిసరాల శుభ్రతను పాటించాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామూహిక కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకోవటం మంచిదని నిపుణుల సూచన.