హైదరాబాద్ చర్మాస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర సంస్థ చర్మాస్‌లో ఫైర్ యాక్సిడెంట్ నెలకొంది. అబిడ్స్ లో ఉన్న చర్మాస్ షోరూమ్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూంలోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో భయాందోళనలకు గురైన కస్టమర్లు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా కొంత తొక్కిసలాట నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణం నష్టం జరగలేదు. […]

హైదరాబాద్ చర్మాస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2020 | 10:14 PM

హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర సంస్థ చర్మాస్‌లో ఫైర్ యాక్సిడెంట్ నెలకొంది. అబిడ్స్ లో ఉన్న చర్మాస్ షోరూమ్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూంలోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో భయాందోళనలకు గురైన కస్టమర్లు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా కొంత తొక్కిసలాట నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణం నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని షోరూం వర్గాలు చెబుతున్నారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్లే షార్ట్ సర్క్యూట్ అయి ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.