AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన ఐదో విడత ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో పలువురు ప్రముఖులు, సామాన్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల అల్లర్లు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని బరక్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్జున్‌సింగ్‌పై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. అలాగే కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు పోలింగ్ […]

ముగిసిన ఐదో విడత ఎన్నికలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 6:46 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో పలువురు ప్రముఖులు, సామాన్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల అల్లర్లు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని బరక్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్జున్‌సింగ్‌పై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. అలాగే కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు పోలింగ్ కేంద్రాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడులు చేశారు.