టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

టీడీపీ నేతల కారుపై కొందరు దాడులు చేయడంతో.. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2020 | 1:31 PM

టీడీపీ నేతల కారుపై కొందరు దాడులు చేయడంతో.. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై కొందరు పెద్ద, పెద్ద కర్రలతో దాడులు చేసి.. కారు అద్దాలు ధ్వంసం చేశారు . స్థానిక ఎన్నికల నామినేషన్లు పరిశీలించేందుకు వెళ్తున్నారు టీడీపీ నేతలు. కాగా.. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీడియా సమావేశం పెట్టి.. టీడీపీ నేతలకు ఫోన్‌ చేసి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంగా ఫోన్‌లో టీడీసీ సీనియర్ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. మేము ప్రాణాలతో ఈ నియోజక వర్గం దాటి బయటకు వస్తామో.. రామో తెలీదని అన్నారు. స్థానికంగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా.. అక్కడికి కూడా వచ్చి అల్లరి మూకలు దాడి చేశాయని.. ప్రస్తుతం మా ఒళ్లంతా రక్తాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బోండా ఉమ.

Read More: వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..