మోదీపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? ఫాలో దిస్.. బట్ కండిషన్స్ అప్లై..!
మీరు ప్రధానిపై కానీ.. మాజీ ప్రధానిపై కానీ ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? అయితే ఎవరికి చెయ్యాలి అన్న సందేహం వస్తుంది. సాధారణంగా ఎవరైనా.. ప్రధానిపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేయాలని చాలా మంది అనుకుంటారు.
మీరు ప్రధానిపై కానీ.. మాజీ ప్రధానిపై కానీ ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? అయితే ఎవరికి చెయ్యాలి అన్న సందేహం వస్తుంది. సాధారణంగా ఎవరైనా.. ప్రధానిపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇక వారు యథేచ్ఛగా ప్రధానిపై కానీ.. మాజీ ప్రధానిపై కానీ ఫిర్యాదు చేయవచ్చు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
లోక్‌పాల్ ఛైర్మన్‌ను నియుక్తి చేసి.. సంవత్సరం కావస్తుండటంతో.. దీనికి సంబంధించన రూల్స్‌ను ఎట్టకేలకు వెల్లడించారు. ప్రధాని లేదా మాజీ ప్రధానిపై వచ్చే అవినీతి ఆరోపణలపై కంప్లైంట్లను పరిశీలించడానికి.. లోక్‌పాల్ ధర్మాసనం అనుమతిస్తుంది. అయితే వచ్చే ఫిర్యాదులు విచారణ చేపట్టే విధంగా ఉంటే.. వాటిని స్వీకరిస్తారు. లేని పక్షంలో 30 రోజుల్లోగా తిరస్కరిస్తారు. తాజాగా వెల్లడించిన లోక్‌పాల్ రూల్స్‌లో దీన్ని పొందుపరిచారు. ప్రధాని లేదా మాజీ ప్రధానిపై.. అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకునేందుకు లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం 2013 అనుమతిస్తుంది. అయితే ఒకవేళ వచ్చిన ఆరోపణలు.. అవాస్తవం అని తేలితే ఆ కంప్లైంట్‌ను లోక్‌పాల్ తిరస్కరించే అవకాశం ఉంది. అంతేకాదు.. విచారణకు సంబంధించిన రికార్డులను ప్రచురించాల్సిన అవసరం కానీ.. అందుబాటులో ఉంచాల్సిన అవసరం కానీ లేదు.
లోక్‌పాల్ మరియు లోకాయుక్త Actలోని Section-53 ప్రకారం.. మాజీ ప్రధానిపై ఫిర్యాదు చేయాలంటే పలు నిబంధనలు వర్తిస్తాయి. మాజీ ప్రధాని పదవీకాలం ముగిసిన ఏడేళ్లలోపే.. ఆయనపై ఫిర్యాదు చేయాలి. ఏడేళ్లు దాటితే అప్పుడు చేసే ఆరోపణలను స్వీకరించబడవు. ప్రధాని లేదా మాజీ ప్రధానిపై అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయి లోక్‌పాల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకున్నా.. వారిపై విచారణ జరిపించాలంటే రెండింట మూడొంతుల సభ్యుల ఆమోదం ఉండాల్సిందే. అంతేకాదు.. మంత్రులు, ఎంపీల విషయంలో కూడా ముగ్గురు సభ్యులు తక్కువకాకుండా ధర్మాసనం ఆమోదం తెలపాలి.
Lokpal Rules-2020 ప్రకారం.. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేయడానికి ముందు దానికి సంబంధించిన కేసు.. ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్‌లో పెండింగ్‌లో ఉంటే దానిని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. నిబంధనల ప్రకారం.. ఫిర్యాదుచేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను, ప్రభుత్వాధికారి వివరాలను..విచారణ పూర్తయ్యేంత వరకు లోక్‌పాల్ గోప్యంగా ఉంచుతుంది. అయితే, ఎవరైనా ఫిర్యాదు దారుడు కానీ.. ప్రభుత్వాధికారి గాని తమకు తాముగా వారి గుర్తింపును బహిర్గంతం చేస్తే ఈ నిబంధనలు వర్తించవు.
వ్యక్తిగతంగా లేదా ఓ వ్యవస్థపై కంప్టైంట్ చేసేటప్పుడు.. ఐడెంటిటీ కార్డు.. రిజిస్ట్రేషన్ ప్రూఫ్స్ సమర్పించాలి. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్) జారీ చేసిన స్మార్ట్ కార్డ్‌ను కూడా గుర్తింపు పత్రాల జాబితాలో చేర్చారు. ఇక ఫిర్యాదులను వ్యక్తిగతంగా.. పోస్టల్ ద్వారా లేదా.. ఆన్‌లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఫిర్యాదు దారు.. ఫిర్యాదును రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన అన్ని భాషల్లోనూ స్వీకరిస్తుంది.. ఇంగ్లీష్‌తో సహా. ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని లేదా అఫిడ్‌విట్‌ను కూడా జతచేయాలి.