మహానంది ఆలయంలో దర్శనమిస్తున్న బూజుపట్టిన లడ్డూలు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయంలో బూజుపట్టిన లడ్డూలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇవే లడ్డూలను అంటగడుతున్నారు. దీంతో మహాప్రసాదంగా భావించే లడ్డూను ఇలా ఇవ్వడంలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారుల ఆదేశాల మేరకు లడ్డూ తయారీని ఏజెన్సీకి అప్పగించారు. ఆ సందర్భంగా చేసిన లడ్డూలు మిగిలి పోయాయి. ఇప్పుడు మిగిలి వాటిని కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వడమేంటని ఆలయ అధికారులు లడ్డూ ఏజెన్సీపై […]
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయంలో బూజుపట్టిన లడ్డూలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇవే లడ్డూలను అంటగడుతున్నారు. దీంతో మహాప్రసాదంగా భావించే లడ్డూను ఇలా ఇవ్వడంలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారుల ఆదేశాల మేరకు లడ్డూ తయారీని ఏజెన్సీకి అప్పగించారు. ఆ సందర్భంగా చేసిన లడ్డూలు మిగిలి పోయాయి. ఇప్పుడు మిగిలి వాటిని కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వడమేంటని ఆలయ అధికారులు లడ్డూ ఏజెన్సీపై మండిపడ్డారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 60 వేలు లడ్డూలు మిగిలిపోయాయని ఆలయ అధికారులు తెలిపారు.