జయరామ్ హత్య కేసు: నటుడి అరెస్ట్

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. నటుడు సూర్య ప్రసాద్‌, కిశోర్‌తో పాటు మరో వ్యక్తిని ఇవాళ మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. జయరామ్‌ను హనీట్రాప్ చేశారన్న ఆరోపణలపై నటుడు సూర్య ప్రసాద్‌ను పోలీసులు ప్రశ్నించారు. హత్యకు ముందు లేడీ వాయిస్‌తో జయరామ్‌తో మాట్లాడి.. రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకువచ్చాడని సూర్యపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు సూర్యను విచారించారు పోలీసులు. అయితే ఈ […]

జయరామ్ హత్య కేసు: నటుడి అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2019 | 7:55 AM

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. నటుడు సూర్య ప్రసాద్‌, కిశోర్‌తో పాటు మరో వ్యక్తిని ఇవాళ మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు.

జయరామ్‌ను హనీట్రాప్ చేశారన్న ఆరోపణలపై నటుడు సూర్య ప్రసాద్‌ను పోలీసులు ప్రశ్నించారు. హత్యకు ముందు లేడీ వాయిస్‌తో జయరామ్‌తో మాట్లాడి.. రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకువచ్చాడని సూర్యపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు సూర్యను విచారించారు పోలీసులు. అయితే ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సూర్య.. కేవలం 25లక్షల అప్పు కోసమే రాకేశ్‌ రెడ్డిని కలిశానని పేర్కొంటున్నాడు. కాగా ఈ కేసులో ఇదివరకు ప్రధాన నిందితుడు రాకేశ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.