నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. నగరంలో టెన్షన్ టెన్షన్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు పెరిగింది. దీంతో అందరిలోనూ భయం పెరుగుతోంది.

నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. నగరంలో టెన్షన్ టెన్షన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 22, 2020 | 10:39 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు పెరిగింది. దీంతో అందరిలోనూ భయం పెరుగుతోంది. బయటకు వెళ్లేందుకు కూడా జనాలు భయపడుతున్నారు. కాగా హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ కరోనా అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మంగళహాట్‌కి చెందిన వ్యక్తి నైజీరియా, లాగోస్ నుంచి అబుదాబీ మీదుగా ఫ్లైట్‌లో ముంబయికి వచ్చాడు. ఈ ఉదయం అతడు ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ వ్యక్తి చేతిపూ ఉన్న హోమ్‌ క్వారంటైన్‌ స్టాంప్‌తో పోలీసులు అతడిని గుర్తించారు. వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కరోనాపై పోరాటం కోసం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపును ప్రజలందరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..