బెజ‌వాడ‌లో రేప‌టి నుంచి లాక్ డౌన్.. 6 రోజులు ఆ మార్కెట్ మూసివేత‌!

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డటం ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో వైర‌స్ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్...

బెజ‌వాడ‌లో రేప‌టి నుంచి లాక్ డౌన్.. 6 రోజులు ఆ మార్కెట్ మూసివేత‌!
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 5:39 PM

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డటం ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో వైర‌స్ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తుంది ఏపీ ప్ర‌భుత్వం. కొన్ని ప్రాంతాల్లో అయితే క‌రోనా కార‌ణంగా వ్యాపారులే స్వ‌చ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. అందులోనూ విజ‌య‌వాడ‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో బెజ‌వాడ‌లోనూ రేప‌టి నుంచి లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. విజ‌య‌వాడ గొల్ల‌పూడి హోల్ సేల్ మార్కెట్‌ను ఆరు రోజుల పాటు బంద్ చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. గొల్ల‌పూడి హోల్ సేల్ మార్కెట్ నుంచి వేర్వేరు ప్రాంతాల‌కు, రాష్ట్రాల‌కు స‌రుకులు ఎగుమ‌తి, దిగుమ‌తి అవుతుంటాయి. కానీ మార్కెట్లో ఎక్కువ‌గా క‌రోనా కేసులు ఉండ‌టంతో.. ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. కాగా ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం.. ఇత‌ర మార్కెట్లపై సైతం ప‌డ‌నుంది.

ఇక‌ ఏపీలో ఆదివారం కొత్తగా 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.

Read More: 

కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. ఆడ‌పిల్ల ఉంటే ఏడాదికి రూ.24 వేలు.. నిజ‌మేనా?

టీటీడీ ఆస్తుల‌పై ఈవో అనిల్ కుమార్ కీల‌క నిర్ణ‌యం..

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..

Latest Articles
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..