శ్రీలంక ఉగ్ర దాడిపై మేరీ రవీంద్రనాధ్ సంచలన వ్యాఖ్యలు

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉదయం వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 185 మంది మృతి చెందగా.. 400 మంది గాయాలపాలయ్యారు. ఇక ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అమానుషం అని ఖచ్చితంగా మీ ప్రజలకు అండగా ఉంటాం అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఈ దాడి పై స్పందిస్తూ క్రైస్తవ సంఘాల నేత మేరీ […]

శ్రీలంక ఉగ్ర దాడిపై మేరీ రవీంద్రనాధ్ సంచలన వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 21, 2019 | 5:32 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉదయం వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 185 మంది మృతి చెందగా.. 400 మంది గాయాలపాలయ్యారు. ఇక ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అమానుషం అని ఖచ్చితంగా మీ ప్రజలకు అండగా ఉంటాం అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు ఈ దాడి పై స్పందిస్తూ క్రైస్తవ సంఘాల నేత మేరీ రవీంద్రనాధ్ మీడియాతో మాట్లాడారు.. ఈస్టర్ పండగ రోజు ఇలా జరగడం చాలా బాధాకరమని… దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. అమాయకులను నిర్దాక్షిణ్యంగా చంపినందుకు వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలని మండిపడ్డారు.