చంద్రయాన్‌-2 : 5వ సారి కక్ష్యను పెంచిన ఇస్రో

ఢిల్లీ : భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌-2’.. చంద్రడిపైకి వడివడిగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగా విజయవంతంగా ఐదోసారి దీని కక్ష్యను పెంచారు. భూస్థిర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-2 కక్ష్యను మంగళవారం మధ్యాహ్నం ఐదో సారి పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. నాలుగో దశ కక్ష్య పెంపు నాలుగు రోజుల క్రితమే విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి స్థిర కక్ష్యలోకి ఆగస్టు 20 నాటికి చేరుతుంది సెప్టెంబరు […]

చంద్రయాన్‌-2 : 5వ సారి కక్ష్యను పెంచిన ఇస్రో
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2019 | 6:40 PM

ఢిల్లీ : భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌-2’.. చంద్రడిపైకి వడివడిగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగా విజయవంతంగా ఐదోసారి దీని కక్ష్యను పెంచారు. భూస్థిర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-2 కక్ష్యను మంగళవారం మధ్యాహ్నం ఐదో సారి పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. నాలుగో దశ కక్ష్య పెంపు నాలుగు రోజుల క్రితమే విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే.

ఆగస్టు 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి స్థిర కక్ష్యలోకి ఆగస్టు 20 నాటికి చేరుతుంది సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ విక్రమ్‌ దిగుతుంది. విక్రమ్‌ నుంచి ప్రజ్ఞాన్‌ అనే రోవర్‌ బయటకొచ్చి పరిశోధనలు జరుపుతుంది. గత నెల 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.