మాపై ఎవరి ఒత్తిడీ లేదు: ద్వివేది
అమరావతి: ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు.. ద్వివేదిని కలిసి వినతపత్రం అందజేశారు. ఆ తర్వాత ఈసీ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. […]
అమరావతి: ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు.. ద్వివేదిని కలిసి వినతపత్రం అందజేశారు. ఆ తర్వాత ఈసీ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ద్వివేది పైవిధంగా వ్యాఖ్యానించారు.