ఏపీకి పన్ను రాయితీలు ఇక లేనట్టే..

ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఏపీకి సాయం అందించేందుకు మొన్న ప్రపంచబ్యాంక్, ఆ తర్వాత చైనా.. ఇప్పడు స్వయానా కేంద్రం కూడా కొన్ని విషయాల్లో చేతులెత్తేసింది. ఏపీలో పరిశ్రమంలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని కేంద్రం తేల్చిచెప్పేసింది. లోక్‌సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జవాబిచ్చారు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:19 pm, Thu, 25 July 19
ఏపీకి పన్ను రాయితీలు ఇక లేనట్టే..

ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఏపీకి సాయం అందించేందుకు మొన్న ప్రపంచబ్యాంక్, ఆ తర్వాత చైనా.. ఇప్పడు స్వయానా కేంద్రం కూడా కొన్ని విషయాల్లో చేతులెత్తేసింది. ఏపీలో పరిశ్రమంలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని కేంద్రం తేల్చిచెప్పేసింది. లోక్‌సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జవాబిచ్చారు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.