దేశ రాజధానిలో వ్యాపారిపై కాల్పులు

దేశరాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. స్ధానిక సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసుల ప్రకారం గురువారం ఉదయం ప్రామినెంట్ డిటర్జెంట్ బ్రాండ్‌‌కు చెందిన వ్యాపారి రాహుల్.. సివిల్ లైన్స్‌లో ప్రాంతంలో గల ఓ జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వ్యాపారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతోొ బాధితుడ్ని వెంటనే అక్కడికి దగ్గర్లో గల పరమానంద హాస్పిటల్‌కి తరలించారు. ఉదయాన్నే జరిగిన ఈ కాల్పులతో స్ధానికంగా కలకలం రేగింది. అయితే […]

దేశ రాజధానిలో వ్యాపారిపై  కాల్పులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 25, 2019 | 7:08 PM

దేశరాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. స్ధానిక సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసుల ప్రకారం గురువారం ఉదయం ప్రామినెంట్ డిటర్జెంట్ బ్రాండ్‌‌కు చెందిన వ్యాపారి రాహుల్.. సివిల్ లైన్స్‌లో ప్రాంతంలో గల ఓ జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వ్యాపారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతోొ బాధితుడ్ని వెంటనే అక్కడికి దగ్గర్లో గల పరమానంద హాస్పిటల్‌కి తరలించారు. ఉదయాన్నే జరిగిన ఈ కాల్పులతో స్ధానికంగా కలకలం రేగింది. అయితే బాధితుడు రాహుల్ పరిస్థితి బాగానే ఉందని, కాల్పులకు తెగబడ్డ దుండగుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు ఏమై ఉంటాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా వారు చెప్పారు.