రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 5, వెస్ట్ బెంగాల్‌లో 3, […]
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 5, వెస్ట్ బెంగాల్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 2, మణిపూర్‌లో 1, త్రిపురలో 1, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఒడిషాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏప్రిల్ 18వ తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలోని 97 లోక్‌సభ స్థానాలకు మొత్తం 1583 మంది పోటీ పడుతున్నారు.