దేశంలోని టాప్ 10 బ్యాంకులు
భారత్‌లో చాలా బ్యాంకులు ఉన్నాయి. కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుంటాయి. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా కస్టమర్ సర్వీసులు, టెక్నాలజీ వినియోగం వంటి అంశాల ప్రాతిపదికన భారత్‌లోని టాప్ 10 బ్యాంకులు ఏవో ఒక లిస్ట్ తయారు చేసింది. ఫోర్బ్స్ దాదాపు 40,000 మంది కస్టమర్ల నుంచి పలు అంశాలకు సంబంధించి రేటింగ్ తీసుకుంది. ఫీజులు, డిజిటల్ సర్వీసులు, నమ్మకం, ఆర్థిక సలహాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం భారత్‌లోని టాప్ […]
భారత్‌లో చాలా బ్యాంకులు ఉన్నాయి. కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుంటాయి. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా కస్టమర్ సర్వీసులు, టెక్నాలజీ వినియోగం వంటి అంశాల ప్రాతిపదికన భారత్‌లోని టాప్ 10 బ్యాంకులు ఏవో ఒక లిస్ట్ తయారు చేసింది.
ఫోర్బ్స్ దాదాపు 40,000 మంది కస్టమర్ల నుంచి పలు అంశాలకు సంబంధించి రేటింగ్ తీసుకుంది. ఫీజులు, డిజిటల్ సర్వీసులు, నమ్మకం, ఆర్థిక సలహాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం భారత్‌లోని టాప్ 10 బ్యాంకులు ఏవో చూద్దాం..
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలో ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది. 2018 నాటికి దాదాపు 88,253 మంది ఉద్యోగులు ఉన్నారు.
- రెండో స్థానం ఐసీఐసీఐ బ్యాంకుది. ఈ బ్యాంక్ హెడ్‌క్వార్టర్ కూడా ముంబైలోనే ఉంది. 2018 నాటికి ఇందులో 81,548 మంది ఉద్యోగులు ఉన్నారు.
- డీబీఎస్ బ్యాంకు మూడో స్థానంలో ఉంది. ఇది విదేశీ బ్యాంక్. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ 4వ స్థానంలో నిలిచింది. 2018 నాటికి ఇందులో 35,717 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంది.
- ఐదో స్థానం ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ది. దీని హెడ్‌క్వార్టర్ చెన్నైలో ఉంది. ఇందులో 2018 నాటికి 9,670 మంది ఉద్యోగులు ఉన్నారు.
- సిండికేట్ బ్యాంక్ ఆరో స్థానంలో ఉంది. దీని హెడ్‌క్వార్టర్ మణిపాల్‌లో ఉంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఏడో స్థానాన్ని ఆక్రమించింది. దీని హెడ్‌క్వార్టర్ ఢిల్లీలో ఉంది. 2018 నాటికి ఇందులో 74,897 మంది ఉద్యోగులు ఉన్నారు.
- అలహాబాద్ బ్యాంక్ 8వ స్థానంలో ఉంది. దీని హెడ్‌క్వార్టర్ కోల్‌కతాలో ఉంది.
- ఇక తొమ్మిదో స్థానంలో విజయా బ్యాంక్ నిలిచింది. బెంగళూరులో దీని హెడ్‌క్వార్టర్ ఉంది. 2018 నాటికి ఇందులో 16,079 మంది ఉద్యోగులు ఉన్నారు.
- పదో స్థానంలో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఉంది. దీని హెడ్‌క్వార్టర్ ముంబైలో ఉంది.